శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు వారి కుటుంబం తరపున రామగుండం MRO ఆఫీస్ ముందర గుట్ట ప్రాంతం లో ఒక పెద్ద శ్రీ హనుమాన్ విగ్రహం నిర్మాణం చేయాలనీ చాలకాలం నుండి కోరుకుంటున్నారు, అదే సమయం లో వారు రామగుండము MLA గా గెలవడం హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతా రాములు వారి కోరికను నేర వేర్చుటకై అన్నట్లుగా 2024 నవంబర్ లో రామగుండం నగరం లోని శ్రీ రామ పాద క్షేత్రం రాముని గుండాల చెంత, MLA శ్రీ రాజ్ ఠాకూర్ గారు అనుకున్న ప్రదేశం లో ఒక అద్భుతం జరిగింది.
రామగుండము MRO ఆఫీస్ ముందర రాముని గుండాల గుట్ట పైన కొంత మంది కాకర చెట్ల నుండి కాకర కాయలు తెంపుకుంటుండగా అట్టి చెట్ల వద్ద సమీపంలో ఒక పెద్ద బండ రాయి కనపడింది దగ్గరకు వెళ్లి నాలుగు వైపులా చూసి ఆ బండ రాయిని తిప్పి చూడగా శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం లా కనబడింది, అప్పుడు వారు మరింత గా నీటితో తుడిచి చూడగా, ఎక్కడ ఎప్పుడు ప్రపంచం లో చూడని విధంగా వున్న శ్రీ హనుమాన్ విగ్రహం బాణం మరియు పిడి కత్తి తొ దర్శనమిచ్చింది.
ఈ విషయం తెలుసుకొని వెంటనే ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆ ప్రదేశమునకు వచ్చి చూసి అట్టి విగ్రహాన్ని పైకి తీసుకు వచ్చి ఒక చెట్టు కింద నిల పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు.
ఇట్టి విషయం స్థానిక శాసన సభ్యులు శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి తెలిసి వారు సతీ సమేతంగా ఈ ప్రాంతాన్ని , శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని చాలా సంబర పడి పోయారు మరియు తనకు ఎంతో కాలంగా వున్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టించాలన్న సంకల్పానికి సాక్షాత్తుగా హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతా రాములు అనుమతి ఇచ్చినట్లుగా భావించారు. ఇది యాదృశ్చికమో దైవ సంకల్పమే అని తలచి వెంటనే మరో ఆలోచన చేయకుండా అదే రోజున అక్కడే 108 ఫీట్ల శ్రీ హనుమాన్ విగ్రం నెలకొలపాలని నిర్ణయం తీసుకొని పూజలు చేసారు.
వేదపండితులని పిలిచి వారికి శ్రీ హనుమాన్ విగ్రహాన్ని చూపగ వారు అందరు అట్టి విగ్రహాన్ని తాము ఎక్కడ చూడలేదని, అందరు కలసి వేదాలను శోధించి శ్రీ స్వామి వారికి శ్రీ దనుర్బాన రామాంజనేయ స్వామి గా నామకరణం చేసారు.
Tourism
Devotional
Creative
Designers
Big
Innovative
Iconic
Historical
: జైశ్రీరామ్ జై హనుమాన్ - జైశ్రీరామ్ జై హనుమాన్ :
ఇలా శ్రీ రాముడు సీతా,లక్ష్మణ సమేతంగా ఈ ప్రదేశంలో వన వాసం చేసినప్పుడు వారి పాదం మోపిన చోట శ్రీ ధనుర్భాణ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టకు మరియు 108 ఫీట్ల స్వామి వారి విగ్రహం, ధ్యాన మందిరం మరియు మొదటి అంతస్తులో 8 దిక్కులలో ఒక్కో దిక్కున 8 రకాల శ్రీ హనుమాన్ విగ్రహం లను 18 ఫీట్ల ఎత్తు తొ నెలకొలపాలని సంకల్పించారు.
ఇట్టి కార్య నిర్వహణకు MLA గారి సతీమణి శ్రీమతి మనాలి ఠాకూర్ గారు ముందుకు వచ్చి MLA గారి సహాయ సహకారంలతో మరి కొంత మంది హనుమాన్ భక్తుల తో సేవా సంకల్పం కల వారితో మరియు ఇతర సనాతన ధర్మాన్ని నమ్మి ఆధ్యాత్మిక భావజాలంతో వున్న వారి సహాయ సహకారం లతో భక్తులందరి సేవ సంకల్పంతో ఒక ట్రస్ట్ ను ఏర్పర్చి శ్రీ హనుమాన్ విగ్రహ నిర్మాణ ప్రాజెక్ట్ ని శర వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇట్టి దేవాలయ నిర్మాణం నిర్వహణ కొరకు శ్రీమతి మనాలి ఠాకూర్ గారు MLA గారి సహకారం తొ కొంత నిధిని ట్రస్ట్ కు ఇవ్వడం జరిగినది ఇట్టి ట్రస్ట్ కు శ్రీ ధనుర్బాన రామాంజనేయ స్వామి ట్రస్ట్ అని నామకరనం చేసి శ్రీమతి మనాలి ఠాకూర్ గారు మేనేజింగ్ ట్రస్టీ గా ఉండి మరికొంత మందిని ట్రష్టి లు గా తీసుకొని సేవలు కొనసాగిస్తున్నారు
ప్రజల ఆధ్యాత్మిక ప్రశాంతతకు ఈ భవ్య మందిరం ఒక సరి కొత్త వేదిక కానుంది ఇప్పటి వరకు ఎంతో మంది వస్తు రూపంలో శ్రమ రూపంలో వారి వారి సహాయ సహకారం లు అందిస్తున్నారు. ఇట్టి నిర్మాణం జరుపుకుంటున్న ప్రదేశాన్ని MLA శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఇంతి పని ఒత్తిడి లో ఉండి కూడా నిత్యం పర్యవేక్షిస్తూ సూచనలు సలహాలు ఇస్తూ పనులు ముందుకు తీసుకెల్లాడానికి ప్రోత్సహం యిస్తున్నారు. ఈ దివ్య భవ్య మందిరం పూర్తయ్యాక ఆ భక్తి పారవశ్యం సంతోషం ఆనందం పతాక స్థాయి లో ఉంటుంది.
శ్రీ సీతా రామ లక్ష్మణులు నడయాడిన ఈ చారిత్రక రాముని గుండాల ప్రాంతంలో ఇట్టి నిర్మాణం ప్రజలందరికి సద్బుద్ధి ని కలగ చేసి ఈ ప్రాంతాన్ని మరియు ప్రాంత ప్రజల కు ఎల్ల వేళలా సుఖ శాంతులు అష్ట ఐశ్వర్యములు కలగ చేస్తుందని ఆశిస్తున్నాం.
ఇట్టి మందిర నిర్మాణంలో భగవద్భక్తులు ఎవరైనా మీ చేతనైన ధన వస్తు శ్రమ రూపంలో సహకారం అందించి ఇట్టి నిర్మాణంలో మీరు కూడా పాత్రులు కాగలరు.
, pixel creator, pixel creator vijay phone 7036241442, vijay, web designing near me, website design creativeminds, web development creative minds, website design creative mind, creative mind, tv ads ad agency creative mind, tv ads making in mancherial, tv ads making in godavarikhani, tv ads making in peddapalli, tv ads making in manthani, VAV Very Advanced Website Pages | http://www.creativemindsoft.in | http://www.creativemindsoft.in | The Complete Editable WEBSITE for you | You can edit your website at any time.. | Very Professional Website, Quick Website, Best Ready made Website. Easy website making. Mobile Comparability Website, SEO Website free Website. How to make Free Website.